25, మే 2020, సోమవారం

శంభుశతకం
మన మధ్య నే వుండే మరొక కవిమితృలు శ్రీ సిరిపురపు నాగ మల్లికార్జున శర్మ  గారు. వీరి విరచితమైన శ్రీ శంభుశతకం నందలి పద్యరత్నాలను విని ఆనందిద్దాం. శ్రీశైల మల్లిఖార్జున సన్నధిలో వుంటూ, వారి నామాన్నే తన నామంగా కలిగి ఆ మల్లఖార్జున వరప్రసాదంగా తన లోని ఆర్తిని ఈ శతకం ద్వారా అందించగలగడం వీరి ప్రత్యేకత. యిక పరిచయం ఎందుకు..మీరే చదువుతారుకదా... ముందు కాస్త రుచిచూద్దాము..

21, మే 2020, గురువారం
సమకాలీన విశిష్ట కవి, నేటి మేటి సుకవి  శ్రీ శ్రీధర్ కొమ్మోజు గారి శతకాన్ని అవలోకిద్దాం.  వీరు వృత్తి రీత్యా గణితో పాధ్యాయులే కానీ వీరిలోని అమ్మభాష పట్ల మమకారం వీరిని తెలుగు సుకవిగా మలచింది. వీరి ఈశ్వరమ్మ శతకం చదివేవారికి అలౌకిక అనుభూతిని, ఆనందాన్ని అందిస్తుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అమ్మ ప్రేమకు సాటి మరేదీ లేదు కదా అమ్మ ని అమితంగా ప్రేమించే మనిషి మహనీయుడు కాక మరేమౌతాడు. వీరి శతకంలో మకుటంగా అమ్మపేరు నుంచుకుని నూటఎనిమిది పర్యాయములు అమ్మ పేరుని స్మరించేరంటే  అమ్మ సాక్షాత్కరించదా.... ఆ అమ్మలగన్నయమ్మ కి ఈ అమ్మ ప్రతిరూపంకాదా.. అంతటి అమ్మ వరాన్ని సాధించిన వీరి శతకం అమూల్యం

12, మే 2020, మంగళవారం

హంసనాదం-మద్దాలి శ్రీనివాస్ విరచితం
మనతోనే కలసి యున్న మరొక అధ్భుత కవి శేఖరుల గురించి వారి మనో కలం నుంచి జాలువారిన హంసనాదం ను ఆస్వాదించుదాము...ఈ హంసనాదం అనే శతకం వారికి అమ్మపట్ల గల ప్రేమనీ, అమ్మలకన్న యమ్మ పట్ల నిబద్దతనీ పాఠకులకు అందించగలడం ఆత్యంత హృద్యమైన కార్యం గా భాసిల్లుతోంది. వారి ఈ పుస్తకాన్ని పొందగలగడం ఒక అదృష్టమైతే దాన్ని మీకు పరిచయంచేయగలగడం మరియొక వరంగా భావిస్తూ..... ఈ పొత్తం లభ్యమైయ్యే చిరునామాను సాహితీలోకం.బ్లాగాస్పాట్.కాం నందు పొందు పరచడమైనది.చిరునామాకు సంప్రదించి, పుస్తకాన్ని కొని ప్రతి ఒక్క తేలుగు భాషా ప్రేమికుడూ చదవాలని ఆకాంక్ష.తెలుగు బిడ్డ శతకం
ఈరోజు మనం మరొక సమకాలీన సహజ కవివర్యులు తన అమృతధారవంటి కవిత్వంతో కవిశ్రీ అనే బిరుదు పొంది ఆ బిరుదునే యింటి పేరుగా మారిపోయిన శ్రీ డేగల సత్యనారాయణ గారు.  వీరిని వారి స్వనామంతో కంటే కవిశ్రీ సత్తిబాబు గారుగానే చిరపరచితులు. వారి ఆధ్యాత్మక చింతన తోనే సుప్రసిధ్ధులైన సహజ కవులు. వారి ఈ తేలుగు బిడ్డ శతకం ప్రతి పాఠశాల గ్రంధాలయంలోనూ చేర్చబడేలా తేలుగు భాషా ప్రేమికులు, పండితులు, తెలుగు భాషోపాధ్యాయులు కృషి సల్పి భావి తరాలకు బంగరు బాటలు వేయగలరని ఆకాంక్షిస్తూ, వారి ఈ పుస్తకాన్ని దీన్ని పుస్తకం అనే కంటే భావికి బాటలు వేసే మధురమైన గ్రంధం అనవచ్చేమో. వేమన పద్యల వంటి తేలిక పదాలతో ఈ శతకం అలరారుతుంది.
          ఈ పుస్తకాన్ని నేను చదవగలగడం, దీని వ్యాఖ్యానించడం అతి పెద్ద సాహసం..అయినా ఈ పుస్తకం పుస్తక ప్రేమికులందరికీ చేరువకావాలని కోరుకుంటూ... వారి పద్యముత్యాలను ఏరుకుందామా....
          పుస్తకం పొందగోరు వారు వీడియో లో చూపిన చిరునామాకు కాని, సాహితీలోకం బ్లాగులో కాని చూసి కానీ పొందగలరని ఆశిస్తూ.....


Subscribe to our newsletter