10, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీ శివ శతకము- నానిస్ మహతి ఛానల్ పరిచయం చేస్తున్న- పరమశివ నిత్యభగవత్ స...

16 కామెంట్‌లు:

  1. మీలాంటి గొర్రెలకి ఇలాంటి డౌట్లు వస్తాయని నాకు ముందే తెలుసు. జై నిత్యానంద. - తెలుగు యోగి తీర్మానం చేశాడు.

    కానీ ఒకరికి నచ్చదనో, కోపాలొస్తాయనో నా అభిప్రాయాలు నేను మార్చుకోను. దైర్యముంటే నా మాటలు ఒప్పుకోండి. నా మాటలు నచ్చితే మీ అదృష్టం ! నచ్చకపోతే మీ ఖర్మ ! అంతే -
    నేను చెప్పిందే వేదం మీరంతా వెధవలు పనికి రాని వాళ్ళు. - తెలుగు యోగి అట్ల డిసైడ్ చేసిండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెఉగుయోగీంద్రుల వారిని ప్రశ్నించే అవకాశం కాని ఏదైనా సందేహనివృత్తికోసం సంప్రదించే అవకాశం కాని లేకపోవటం దురదృష్టం. పోనివ్వండి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. తప్పులేదు.

      నిత్యానంద కనుక అంత నికార్సైన శక్తియుక్తులు కల తాంత్రికస్వామి ఐన పక్షంలో ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు కదా. అంటువంటప్పుడు ఆ నిత్యానంద గారు దేశం వదలిపెట్టి పోవటం ఎందుకు? ఎక్కడో అజ్ఞాతంగా ఉండవలసిన అవసరం ఏమిటి? సర్వశక్తిసమన్వితుడిని దేశ‌ం‌ కాదు ప్రపంచం మొత్తం ఏకంగా ఎదిరించినా అయన నిర్భయంగా ఉన్నచోటే ఉండి ఎవరినీ‌ పట్టించుకొనకుండా హాయిగా ఉండాలే‌ మరి!

      తొలగించండి
    2. సర్ తెలుగు యోగి గారు గొప్ప పండితుడు సాధకుడు అయి ఉండవచ్చు కానీ
      ఆధ్యాత్మిక అహంకారం లో చిక్కుకున్నాడు. విమర్శను కానీ ఇతరుల అభిప్రాయం కానీ స్వీకరించే స్థితిలో లేడు.వామాచార కౌళ మార్గం వారిని పొగడుతూ, సమయాచార సాధకులను, ప్రవచన కారులను నిందిస్తాడు.

      నిత్యానంద, యూ జీ కృష్ణ మూర్తి, ఓషో , .. వీళ్ళు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ. కళ్లకు గంతలు కట్టి చదివించడం, కూర్చున్న వారిని ఎగిరి పడేలా చేయడం,కాషాయ వస్త్రాలు ధరించి అపవిత్ర పనులు చేయడం ఈ గారడీ ల వల్ల ఏమి ప్రయోజనం.


      సాహితీ లోకం బ్లాగు లో ఇతర విషయం వ్రాసినందుకు sorry.

      తొలగించండి
    3. @శ్యామలీయం:

      "తెఉగుయోగీంద్రుల వారిని ప్రశ్నించే అవకాశం కాని ఏదైనా సందేహనివృత్తికోసం సంప్రదించే అవకాశం కాని లేకపోవటం దురదృష్టం"

      గురువు గారూ, బ్లాగులో ఇమెయిల్ ఐడి ఇచ్చారండీ. ఆయనకు ఇంగిలీషు బ్లాగు కూడా ఉంది: అక్కడ కామెంటుల సౌకర్యం ఉంది.

      తొలగించండి
  2. ఇంతకు మునుపు వారి సెల్ ఫోన్ నెంబరు కూడా ఉండేది వారి బ్లాగు ప్రొఫైల్ లో. ఇప్పుడు తీసేసినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Feed back ఇవ్వకుండా ఉండలేను కనుక ఆయనకు మెయిల్స్ ఇచ్చాను. ఒక సారి కుర్తాళం స్వామి గారి విద్వత్తు గురించి ఒక పోస్టు వ్రాయమని అడిగాను. దానికి కుర్తాళం స్వామిని చులకన గా నిందించాడు.. పైగా అద్భుత మయిన రచయిత కాబట్టి మంచి కల్పనా చాతుర్యంతో ఉన్నవీ లేనివీ కల్పించి నన్ను స్వామి శిష్యుడిగా చిత్రించి ఒక వ్యంగ్య టపా కూడా వ్రాశాడు. నాకు భలే నవ్వు వచ్చింది. ఏమైనా ఆయన గొప్ప ప్రజ్ఞ ప్రతిభ కలిగిన వారు. వారిని కించపరిచే ఉద్దేశ్యం లేదు. వారంటే గౌరవం ఉంది. అయితే నచ్చని విషయాలు feedback తీసుకోవడం లో ఆయన మామూలు మానవుడే.😁👻🏂🏇🏄🏂👼

      తొలగించండి
  3. ఆధ్యాత్మిక అహంకారం అంటే ఒక కథ గుర్తుకు వస్తున్నది. ఒకప్పుడు జైమిని మహర్షి అంతటివారికి ఒక సందేహం వచ్చింది. బలవా నింద్రియ గ్రామో‌ విద్వాంస మపి కర్షతి అని ఎందుకన్నారండీ, విద్వాంసం‌ నాప కర్షతి అని అనాలి కదా అని వ్యాసులవారితో చర్చించాడు. వ్యాసులవారు ఏమో‌ నాయనా నేను భగవానువాచను యథాతధంగా వ్రాసాను. ఆయన అలా ఎందుకన్నారో‌ మరి అని ఊరకున్నారు. జైమిని సందేహం‌ తీరిందో లేదో.

    కొన్నాళ్ళు పోయాక జైమిని మహర్షి ఒక అడవి పిల్లను చూసి మోహపడటం‌ జరిగింది. ఎంత ప్రయత్నించినా మనస్సు నిగ్రహపడక పోవటంతో ఆపిల్లను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ అమ్మాయేమో ఏమయ్యా నువ్వు మా ఆచారం ప్రకారం‌ నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మా పెద్దలను అడిగి పెళ్ళిచేసుకోవాలి అని చెప్పింది. ఆయన ఒప్పుకొని అలాగే ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు.

    మధ్యలో ఎవరో విద్వాంసం‌ నాపకర్షతి అని అన్నట్లు లీలగా వినిపించింది. కొద్ది సేపటికి ఇంకొంచెం స్పష్టంగా మళ్ళా విద్వాంసం‌ నాపకర్షతి అని వినబడింది. ఈసారి ఆమాట తాను నెత్తిన పెట్టుకొని వెళ్తున్న అమ్మాయి నుండే వచ్చిందని గ్రహించాడు. ఉలిక్కిపడి చూస్తే తాను మోస్తున్నది గురువుగారు వ్యాసుణ్ణి. ఆయన ఒక మొట్టి కాయ వేసి విద్వాంసం నాపకర్షతి కదా అని నవ్వుతూ అంటే జైమినికి సిగ్గు కలిగింది. ఇంద్రియాలు బలమైనవే కాని (తన బోటి) జ్ఞానులను మాత్రం అవి ఆకర్షించలేవు అని పాఠంలోనే తప్పును వెదికిన తన జ్ఞానాహంకారానికి మహర్షి సిగ్గుపడి గురువు పాదాలకు నమస్కరించారు జైమిని మహర్షి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ, కొన్ని చోట్ల జైమిని గురువు పేరు బాదరాయణ అనుందండీ. ఇది వ్యాసుడికి ఇంకో నామమా లేక జైమిని ఇరువురికీ శిష్యుడా? సందేహనివృత్తికి థాంక్సు.

      తొలగించండి
    2. బాదరాయణుడు అంటే వేదవ్యాసుడే నుండీ.

      తొలగించండి
    3. మీది తెనాలి మాదీ తెనాలి లాగా బాదరాయణ సంబంధం జాతీయం ఉంది. బదరిక (రేగు చెట్టు) కొయ్య తో చేసిన సామగ్రి ఎవరి దగ్గర ఉందో అందరికీ బాదరాయణ సంబధం ఉన్నట్లే. బ్లాగుల్లో బాదర్ చేయడం కూడా బాదరాయణ సంబంధమే. 😁🏂👻🐿🐇🐘

      తొలగించండి
  4. “బుచికి” గారు,
    కుర్తాళం స్వామి అంటే మీరనేది శ్రీ ప్రసాదరాయ కులపతి గారి గురించా?

    ఆయన గురించి లేదా మీ గురించి తెలుగు యోగి గారు వ్రాసిన ఆ వ్యంగ్య వ్యాసం తేదీ చెప్పగలరా, లేదా లింక్ గాని?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట గారు. సర్ ఆ టపా లింక్ http://www.teluguyogi.net/2018/11/blog-post_37.html?m=0

      నేను మెయిల్ ఇస్తే దాన్ని అందమైన కల్పనతో ఫోన్ చేసినట్టుగా మార్చి వ్రాశాడు ఆయన. కుర్తాళం స్వామి సిద్దేశ్వరానంద భారతి ( ప్రసాద రాయ కులపతి ) గారి ప్రవచనాలు చాలా నచ్చుతాయి నాకు. ఆ విషయం తెలిపితే నేనేదో ఆశ్రమం లోని శిష్యుడిగా చిత్రించి funny skit వ్రాశాడు తెలుగు యోగి.

      ఒక విషయం మాత్రం నిజం. ఆయన ఒక గొప్ప రచయిత. ఏకబిగిన చదవాలి అనిపించేలా ఉంటాయి ఆయన రచనలు. జిల్లెళ్ళమూడి అమ్మ గారి వ్యాసాలు, శిక్కుల గురించి వ్రాసినవి, తారా దేవి ఆరాధన వ్యాసాలు చాలా బాగా వ్రాశారు.

      It seems he has firmed up non negotiables.

      తొలగించండి
    2. విద్య యొసగు వినయము .... అన్న సూక్తి వారిని టచ్ చేసినట్లు లేదు.

      తొలగించండి