23, ఏప్రిల్ 2020, గురువారం

మంజునాధ శతకం- నుతిత్రయి ప్రధమ భాగం.

మంజునాధ శతకం


 నుతిత్రయి అను కృతి సంపుటి ప్రధమ భాగమైన మంజునాధ శతకం పరిచయ చేసుకుందాం.  ఈ నుతిత్రయి అనే గ్రంధాన్ని సర్వ శ్రీ సూలూరి శివ సుబ్రమణ్య గారు, కాటేపల్లి లక్ష్మీ నరశింహమూర్తిగారూ, ముడుంబకృష్ణ మాచార్యులవార్లు కలిసి అందిచడం జరిగింది. ఇందులో తొలుతగా శ్రీ మంజునాధ శతకం, ద్వితీయంగా జానకీ ప్రియోదాహరణం, చివరగా పాదైకనియమంతో రచింపడిన సన్యాసశతకం కలవు. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా పరిచయం చేయడానికి సాహసిస్తున్నాను. వెరశి ఈపుస్తకం ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఉండాలని, ఈ పొత్తం లభ్యమైయ్యే చిరునామాను సాహితీలోకం.బ్లాగాస్పాట్.కాం నందు పొందు పరచడమైనది.చిరునామాకు సంప్రదించి, పుస్తకాన్ని కొని ప్రతి ఒక్క తెలుగు భాషా ప్రేమికుడూ చదవాలని ఆకాంక్ష.


21, ఏప్రిల్ 2020, మంగళవారం

అక్షరార్చన-అక్షరమాల శతకం

అక్షరార్చన-అక్షరమాల శతకం


శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారు రచించిన అక్షరార్చన అనే అక్షరమాల శతకం...యింతవరకు తెలుగు సాహిత్యచరిత్రలో తెలుగు వర్ణమాలలోని అశ్రరములనుపాద ప్రారంభమున మరియు యతిస్థానమున వ్రాసినవారు లేరు. తెలుగు సాహితీ చరిత్రలో నే యిటువంటి రచన యింతవరుకూ ఎవరూ చేసియుండలేదని ప్రఖ్యాత సాహితీకారులు శ్రీ తొపెల్ల బాలసుబ్రమణ్య శర్మ గారు కీర్తించేరంటేనే రచయిత్రి గారికి భాష పట్ల గల మక్కువ ఎంతో మనకు అవగతమవుతుంది. ఆ శారదా దేవి కృప తో యింతటి ఘన శతకం తెలుగు పాఠకులకి, భాషా ప్రేమికులకు లభించడం ఒక వరం.

ఈ పుస్తకం పొంద గోరు వారు పే చిత్రలో గల చిరునామాకు సంప్రదించి 

పొందగలరని ఆశిస్తాను.



18, ఏప్రిల్ 2020, శనివారం

శంకర శతకము

శంకరశతకము







               ఈరోజు శంకర శతకము గురించి , ఆశతకాన్ని రచించిన వారి గురించిన విశేషాలు తెలుసు కుందాం..శ్రీ కందిశంకరయ్య గారు ఈ శతకాన్ని ఒక్క రోజులో రచించారు, పద్యలోకంలో వీరి గురించి తెలియని వారుండరు, నిరాడంబరులు, నిగర్వి, సౌజన్యమూర్తి,అన్నిటినీ మించి ఉత్తమగురువు, ఈయన తెలుగు ఉపాధ్యాయనిగా భాధ్యతలు నిర్వహించి , రిటైర్ అయిన తదుపరి శంకరాభరణం బ్లాగు నెలకొల్పిఆన్ లైన్లో  ఎందరినో కవులుగా, కవయిత్రులుగా , తయారు చేసారు,దశాబ్దకాలంగా ఈ బ్లాగులో పద్యసమస్యలు ఇస్తూ ఇప్పటికి 3,340 సమస్యలు ఇచ్చి సమస్యా పృచ్ఛక చక్రవర్తి అనేతన బిరుదును సార్ధకంచేసుకున్నారు, అంతేకాదు ,ఒక్క రోజు కూడా విరామం లేకుండా పద్య సమస్య లిచ్చే బ్లాగు ఇదొక్కటి మాత్రమే అని ఘంటాపధంగా చెప్పవచ్చు..
ఇక ఈ శతకం శివరాత్రి పర్వ దినాన ప్రారంభించి, ఒక్క రోజులో శతకాన్ని పూర్తిచేసి, తనకు, ఇది చదివిన వారికి గొప్ప పుణ్యాన్ని మూటకట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించారు,ఈ శతకంలోని పద్యములు శబ్దాలంకారాలతో, మధుర పద ధారలతో, భక్తిభావ తత్పరతతో, అలరించుతూ చదువరుల మనసులను హత్తుకుంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..ప్రతీ ఒక్కరు ఈ అమూల్య రత్నాన్ని చదివి , తమ పిల్లలకు కూడా వివరించి, తెలుగు పద్యపు తీపిని తెలియ జేస్తే ఇటువంటి గురువుల పర్యవేక్షణలో రేపటి తరానికి సత్కవుల నందించే వారవుతారు..
ఈ పుస్తకం పొందగోరేవారుశ్రీ కంది శంకరయ్య గారి చరవాణిని సంప్రదించి పొందగలరు...

16, ఏప్రిల్ 2020, గురువారం

బంగరుకొండా నీతి శతకం

బంగరుకొండా నీతి శతకం








ఈ రోజు మనం మరో చక్కని పుస్తకాన్ని అవలోకిద్దాం... ఇది శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు రచించిన బంగరుకొండా అనే పిల్లల నీతి శతకం... నీతి శతకాలంటే మనకి వేమన, సుమతి శతకాలే తలపులోకొస్తాయి...కానీ వాటేకి ఏ మాత్రం తీసిపోని, చక్కని, చిక్కని, తేలిక కందాలలో పిల్లల స్థాయికి అందే ఈ శతకాన్ని పరిచయం చేయగలగడం నా పూర్వ జన్మ సుకృతం... వీరు వృత్తరీత్యా న్యాయవాది అయినప్పటికీ, తెలుగు భాష పట్ల ఎంతో ప్రేమతో సృజనతో, పద్యరచనను ప్రేమించి, ప్రెరేపించి, ప్రజపద్య సమూహాన్ని చిరుదరహాసంతో నడిపిస్తున్న వీరి చతురత,భాషపై ప్రేమ అనితరసాధ్యం.. 

ఈ పుస్తకాన్ని పొందగోరు వారు.. వారి చరవాణిని సంప్రదించి పొందగలరు. 
వారి చరవాణి 9246531895 లేదా  క్రింది మెసేజ్ బాక్సులో 

గాని తెలియచేయగలరు.

13, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీనివాస శతకం.






శ్రీ రాజారావుగారు సహకారశాఖలో ఉద్యోగం చేస్తూనే భాషపై గల మక్కువతో పద్యరచన కు పూనుకుని తొలుతగా యిష్టదైవమైన వేంకటపతి పై ద్విమకుట సీసపద్య శతకం రచించడం ఆయనకు గల భాష పై నిబద్దతను, అనురక్తిని చెప్పకనే చెబుతున్నాయి... ఈ పుస్తకం నందలి ప్రతి పద్యం ప్రతిఒక్కరి మనస్సులలో మెదులుతాయనడం అతిశయోక్తి కాదు. ప్రతి తెలుగు వారింటా వుండవలసిన పుస్తకాలలో ఈ పుస్తకాన్ని కూడా చేర్చి, ఆ వేంకట పతిని కవి గారి మాటలలో తమ మాటగా జత కలిపి ఆశ్రయిస్తారని, పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ.......