శంకరశతకము
ఈరోజు శంకర శతకము గురించి ,
ఆశతకాన్ని రచించిన వారి గురించిన విశేషాలు తెలుసు కుందాం..శ్రీ కందిశంకరయ్య
గారు ఈ శతకాన్ని ఒక్క రోజులో రచించారు, పద్యలోకంలో వీరి గురించి తెలియని
వారుండరు, నిరాడంబరులు, నిగర్వి, సౌజన్యమూర్తి,అన్నిటినీ మించి ఉత్తమగురువు, ఈయన తెలుగు
ఉపాధ్యాయనిగా భాధ్యతలు నిర్వహించి , రిటైర్ అయిన తదుపరి ‘శంకరాభరణం బ్లాగు’ నెలకొల్పిఆన్ లైన్లో ఎందరినో కవులుగా, కవయిత్రులుగా , తయారు చేసారు,దశాబ్దకాలంగా
ఈ బ్లాగులో పద్యసమస్యలు ఇస్తూ ఇప్పటికి 3,340 సమస్యలు ఇచ్చి ‘సమస్యా పృచ్ఛక చక్రవర్తి’ అనేతన బిరుదును
సార్ధకంచేసుకున్నారు, అంతేకాదు ,ఒక్క రోజు కూడా విరామం లేకుండా పద్య సమస్య లిచ్చే
బ్లాగు ఇదొక్కటి మాత్రమే అని ఘంటాపధంగా చెప్పవచ్చు..
ఇక ఈ శతకం శివరాత్రి పర్వ
దినాన ప్రారంభించి, ఒక్క రోజులో శతకాన్ని పూర్తిచేసి, తనకు, ఇది చదివిన వారికి
గొప్ప పుణ్యాన్ని మూటకట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించారు,ఈ శతకంలోని పద్యములు
శబ్దాలంకారాలతో, మధుర పద ధారలతో, భక్తిభావ తత్పరతతో, అలరించుతూ చదువరుల మనసులను
హత్తుకుంటాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..ప్రతీ ఒక్కరు ఈ అమూల్య
రత్నాన్ని చదివి , తమ పిల్లలకు కూడా వివరించి, తెలుగు పద్యపు తీపిని తెలియ జేస్తే
ఇటువంటి గురువుల పర్యవేక్షణలో రేపటి తరానికి సత్కవుల నందించే వారవుతారు..
ఈ పుస్తకం పొందగోరేవారుశ్రీ
కంది శంకరయ్య గారి చరవాణిని సంప్రదించి పొందగలరు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి