24, సెప్టెంబర్ 2020, గురువారం

నీలకంఠ శతకము-శ్రీ పల్లా నరేంద్ర గారి విరచితం-నానిస్ మహతి ఛానల్ సవినయ పరి...





సాహితీ వారధి మహతిఛానల్ పుస్తక పరిచయవేదిక సవినయంగా వీక్షకులముందుకు తెస్తున్న మరొక విలక్షణ రచయిత రచించిన "నిజమునీకె యెరుక నీలకంఠ" మకుటంతో విలసిల్లిన నీలకంఠ శతకం.. రచించిన కవి
శ్రీ పల్లా నరేంద్ర గారు.. వీరు యింజనీరింగు చదివి. జలవనరుల నభివృద్ధి చేయడమే కాకుండా  పితృసంపార్జిత భాషా విశిష్టతతో కలంపట్టి పద్య సేద్యం చేస్తున్నారు..  వారికి గల అవ్యాజమైన భాషాప్రేమకు నీలకంఠశతకం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే వారు  శంకరాభరణంబ్లాగు నుండి పద్యవిద్య గరపి ఈశతకానికి ప్రతిష్ట చేసారట.. కానీ అలవోకగా అల్లిన పద్యాలను చూస్తుంటే ఏదో నేర్చేసుకుని వ్రాసిన పద్యాలలా కాకుండా పరిణితి చెందిన కవివరేణ్యుని అల్లిక లా సూక్ష్మంగా. సున్నితంగా.. అలతి పదాలతో తన భావాలకు అక్షరరూపం యిచ్చినట్లున్నారు.. యింతకీ వీరి పద్య రత్నాలను నేనొక్కడినే ఆస్వాదించను లెండి..రండి వారి అంతరంగ ప్రవేశం చేద్దాం..

            వీరి పుస్తకాన్ని పొంద గోరువారు పల్లా నరేంద్ర,9-7-36,మారుతీ నగర్, సంతోష్ నగర్,హైదరాబాదు, 500 059,Mobile 9440169713 కు సంప్రదించగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి